![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో , బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. ఏ విషయం మీదైనా స్పందిస్తుంది. ఎంతదూరమైనా వెళ్తుంది. ఏ విషయం మీదైనా ముందుగా స్పందించేవాళ్ళల్లో ఎక్కువగా చిన్మయి శ్రీపాద, రష్మీ గౌతమ్, రేణు దేశాయ్, అనసూయ పేర్లను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక అనసూయ కూడా చాలా రెబెల్ గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ట్విట్టర్ లో ఆల్రెడీ రష్మీ గౌతమ్ కి నెటిజన్స్ కి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతోంది.

ఇప్పుడు అనసూయ హైదరాబాద్ లో జరుగుతున్నా కెబిఆర్ పార్క్ విషయంలో జరుగుతున్న విషయం మీద ఒక పోస్టర్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అంతే కాదు ఇంకో పోస్ట్ కూడా పెట్టింది. "ప్రజా సమస్యలపై నేను స్పందించాలని ప్రజలు ఆశించడం ఒక వరమే కాదు ఇంకో శాపం కూడా అని నేను భావిస్తున్నాను. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సమస్యకు నేను జవాబుదారీగా ఉండాలని ఆశిస్తున్న వారందరికీ నేను చెప్పేది ఇదే. నేను చెప్పేదేంటంటే, ప్రతీసారి నాకు జరుగుతున్న విషయాలపై పూర్తి అవగాహన ఉండదు..
ప్రతీసారి నాకు సమయం దొరకదు... ప్రతీసారి నాకు జరిగే సమస్యపై లోతుపాతులు తెలీవు . కాబట్టి సంబంధిత విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటేనే నేను మాట్లాడతాను..." అంటూ అనసూయ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో చెప్పుకుంది. అలాగే ఈ పార్క్ విషయంలో చేస్తున్న కొన్ని వీడియోస్ ని కూడా తన స్టేటస్ లో పెట్టుకుంది. అంటే తాను డైరెక్ట్ గా మాట్లాడకుండా తనకు అనిపించింది ఎక్కడైనా కనిపిస్తే దాన్ని తన మాటగా స్టేటస్ పెట్టి చెప్పాలనుకున్నాడు చెప్తోంది అనసూయ. ఎందుకంటే గతంలో చాలా ఇష్యుస్ ని ఆమె ఫేస్ చేసిన విషయం తెలిసిందే.
![]() |
![]() |